Tuesday, August 19, 2008

ఇళయరాజా సంగీతం

చాలా రోజులుగా సంగీతాభిమానులకు మాత్రమే అంకితం కాబడినటువంటి బ్లాగు ల కోసం వెతికి వెతికి వేసారి చివరకు నేనే ఒక బ్లాగు మొదలు పెడదాం అనుకున్నాను. చివరకు ఇప్పుడు మొదలు పెడుతున్నాను. నాకు నచ్చిన పాటల గురించిన వివరణలతో ఈ బ్లాగు సాగుతుంది. సంగీత ప్రియులు ఆనందిస్తారని ఆశిస్తున్నాను.
స్వతహాగా ఇళయరాజా అభిమానిని కాబట్టి ఆయన కంపోజ్ చేసిన ఒక తమిళ పాట తో మొదలు పెడుతున్నాను.

1 ఇళయనిలా పొళ్లిగిరదే (ఈ పదాన్ని తెలుగులో వ్రాయడం కష్టం) :
దీనిలో ఇళయరాజా వాడిన ఇంటర్లూడ్స్ తమిళ్ ఫిల్మ్ మ్యూజిక్ లో ఇప్పటివరకు వాడబడిన కాంప్లెక్స్ గిటార్ ఇంటర్లూడ్స్ లో ఒకటి. వీడియో చివరిలో బాలు గారి ఇంప్రోవైజేషన్ చూడండి.






6 comments:

Kathi Mahesh Kumar said...

సంగీతాన్నభిమానించే అందరికీ ఇళయరాజా ఆరాధ్యుడే..కానివ్వండి.

Anil Dasari said...

ఆయన కంపోజర్‌గా ఎంత గొప్పవాడో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేపని లేదు కానీ 1990లలో 'కూలీ నంబర్ 1' తో అనుకుంటా తెలుగులో కూడా పాటలు స్వయంగా పాడటం మొదలెట్టి చంపేశాడు. తమిళంలో అప్పటికే కొన్ని వందలు పాడాడు, అవి తమిళోళ్లకి నచ్చాయి కానీ ఆ గాత్రం తెలుగుకి పనికి రాదు. అయినా ఇళయరాజా దక్షిణాది సినీ సంగీతానికి చేసిన సేవని దృష్టిలో పెట్టుకుని ఆయన గానాభిలాషని క్షమించెయ్యొచ్చు.

వర్డ్ వెరిఫికేషన్ తీసేస్తారా? కామెంటే వాళ్లకి ఇదో పెద్ద చిరాకు పరిచే విషయం.

RG said...

అబ్రకదబ్రగారు, ఇళయరాజా ఎప్పుడో సీతాకోకచిలుక సినిమాలోనే తెలుగుపాటలు పాడినట్టు గుర్తు. లేడీస్ టైలర్ టైటిల్ పాటలోకూడా ఆయన గొంతు వినిపిస్తుంది. అయినా ఆయన గొంతు నాకు నచ్చుతుంది, ఇప్పుడు పాడుతున్న కొంతమందికంటే...

నిషిగంధ said...

Beautiful song! Looking forward for more..

Anil Dasari said...

RSG గారు

మీరన్నది నిజమే. ఇప్పుడు పాడుతున్న చాలామంది కన్నా ఇళయరాజా గొంతు నయం. అయితే అప్పట్లో మాత్రం నేనా గొంతు తట్టుకోలేకపోయేవాడిని. గొంతు విప్పి పాడేవాళ్లే సింగర్స్ నా దృష్టిలో, కుమార్ సాను లాగా ముక్కు విప్పి పాడే వాళ్లు కాదు :-)

RG said...

Idi Hindi lo kooda vinnanu, Hindi mundu vachinda, tamil mundu vachindaa ??

I don't believe Iliayaraaja was *inspired* from a Hindi song !!!!
Ok.. I'll rephrase, I don't want to believe :)