Tuesday, August 19, 2008

ఇళయరాజా సంగీతం

చాలా రోజులుగా సంగీతాభిమానులకు మాత్రమే అంకితం కాబడినటువంటి బ్లాగు ల కోసం వెతికి వెతికి వేసారి చివరకు నేనే ఒక బ్లాగు మొదలు పెడదాం అనుకున్నాను. చివరకు ఇప్పుడు మొదలు పెడుతున్నాను. నాకు నచ్చిన పాటల గురించిన వివరణలతో ఈ బ్లాగు సాగుతుంది. సంగీత ప్రియులు ఆనందిస్తారని ఆశిస్తున్నాను.
స్వతహాగా ఇళయరాజా అభిమానిని కాబట్టి ఆయన కంపోజ్ చేసిన ఒక తమిళ పాట తో మొదలు పెడుతున్నాను.

1 ఇళయనిలా పొళ్లిగిరదే (ఈ పదాన్ని తెలుగులో వ్రాయడం కష్టం) :
దీనిలో ఇళయరాజా వాడిన ఇంటర్లూడ్స్ తమిళ్ ఫిల్మ్ మ్యూజిక్ లో ఇప్పటివరకు వాడబడిన కాంప్లెక్స్ గిటార్ ఇంటర్లూడ్స్ లో ఒకటి. వీడియో చివరిలో బాలు గారి ఇంప్రోవైజేషన్ చూడండి.